గంగూలీతో భేటీ అయిన విరాట్ కోహ్లీ

  • సమావేశంలో పాల్గొన్న బీసీసీఐ సెక్రటరీ జై షా
  • టీ20 ప్రపంచకప్ పై చర్చ  
  • గెలవాల్సిన వ్యూహాలపై సవివరంగా చర్చ 
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జై షాలతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భేటీ అయ్యాడు. ఈ భేటీలో త్వరలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్ పై చర్చించినట్టు సమాచారం. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా మంచి విజయాలను సాధించినప్పటికీ... కీలక టోర్నీలలో మాత్రం ఓటమిపాలయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లను కోల్పోయింది.

దీంతో రాబోయే టోర్నీలలో కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో, గెలవాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పుపై చర్చించినట్టు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ వేదికను కరోనా కారణంగా యూఏఈకి మార్చిన విషయం విదితమే.


More Telugu News