వివేకానందరెడ్డి హత్యపై సమాచారమిస్తే రూ. 5 లక్షల నజరానా.. సీబీఐ పత్రికా ప్రకటన!
- వివేకా హత్య కేసులో కీలక మలుపు
- కచ్చితమైన సమాచారం ఇస్తే భారీ నజరానా ఇస్తామని సీబీఐ ప్రకటన
- వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను విచారిస్తున్న సీబీఐ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది.
సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.