సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తమన్నా చెబుతున్న వంటల ముచ్చట్లు
- నాగార్జున 'బంగార్రాజు' కోసం భారీ సెట్స్
- ఎన్టీఆర్, కొరటాల సినిమా అప్ డేట్
* కథానాయిక తమన్నా త్వరలో కిచెన్ కబుర్లు చెప్పనుంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వంటల కార్యక్రమం 'మాస్టర్ చెఫ్' తెలుగు వెర్షన్ కు ఆమె హోస్ట్ గా చేస్తోంది. ఈ నెల 27 నుంచి జెమినీ టీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం గురించి తమన్నా తాజాగా చెబుతూ, "నేను మామూలుగా ఆహార ప్రియురాలిని. అలాంటి నేను మాస్టర్ చెఫ్ కు హోస్ట్ గా చేయడం ఆనందంగా వుంది. మంచి వంటలను మీకు పరిచయం చేస్తాను. ఈ కార్యక్రమం కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది" అని చెప్పింది.
* అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బంగార్రాజు' సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి జరుగుతుంది. ఇందుకోసం హైదరాబాదు, అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్స్ వేస్తున్నారు. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. మరో జంటగా నాగ చైతన్య, కృతి శెట్టి నటిస్తున్నారు.
* ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును అక్టోబర్ రెండో వారం నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఇదే!