డీఆర్డీవో అనుబంధ సంస్థ 'ఇమారత్'కు డైరెక్టర్ గా తెలుగు శాస్త్రవేత్త
- గుంటూరు జిల్లాకు చెందిన ఉమ్మలనేని రాజబాబు
- డీఆర్డీవోకు ఎనలేని సేవలు అందించిన వైనం
- బాలిస్టిక్ మిస్సైళ్లు, యాంటీ శాటిలైట్ మిస్సైల్ రూపకల్పనలో కృషి
- తాజాగా కీలక బాధ్యతల అప్పగింత
తెలుగుతేజం ఉమ్మలనేని రాజబాబు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సీఐ) సంస్థ డైరెక్టర్ గా నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన రాజబాబు బాలిస్టిక్ క్షిపణుల తయారీలో నిపుణుడిగా గుర్తింపు పొందారు. ఆయన డీఆర్డీవోలో ప్రోగ్రామ్ డైరెక్టర్ గా పనిచేశారు. అయన అనుభవం ఇమారత్ కు విశేషంగా లాభిస్తుందని డీఆర్డీవో వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాదులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్ లో ప్రీమియర్ ఏవియానిక్స్ ల్యాబరేటరీ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఉంది.
కాగా, డీఆర్డీవో స్వావలంబన దిశగా అడుగులు వేయడంలో రాజబాబు పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా, భారత్ మొట్టమొదటి యాంటీ శాటిలైట్ మిస్సైల్ రూపకల్పనలో రాజబాబు కీలకపాత్ర పోషించారు.
కాగా, డీఆర్డీవో స్వావలంబన దిశగా అడుగులు వేయడంలో రాజబాబు పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా, భారత్ మొట్టమొదటి యాంటీ శాటిలైట్ మిస్సైల్ రూపకల్పనలో రాజబాబు కీలకపాత్ర పోషించారు.