నితిన్ 'మాస్ట్రో' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
- నితిన్ తాజా చిత్రంగా 'మాస్ట్రో'
- డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్
- ఈ నెల 23వ తేదీన ట్రైలర్ విడుదల
- కీలక పాత్రలో తమన్నా
నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా రూపొందింది. నికితా రెడ్డి - సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా నభా నటేశ్ నటించగా, కీలకమైన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీలో వస్తుందా? అనే సందేహంలో చాలామంది ఉన్నారు. ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కొంతకాలం క్రితం హిందీలో విజయవంతమైన 'అంధదూన్' సినిమాకి ఇది రీమేక్. 'రంగ్ దే' .. 'చెక్' వంటి అపజయాల తరువాత నితిన్ నుంచి వస్తున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఇటీవల నభా నటేశ్ చేసిన సినిమాలు కూడా ఆమెకి పెద్దగా కలిసి రాలేదు. ఈ సినిమా అయినా ఊరటనిస్తుందేమో చూడాలి.