పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడి అరెస్ట్

  • విజయనగరం జిల్లా చౌడువాడలో ఘటన
  • అర్ధరాత్రి యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
  • దిశ యాప్ కాల్ ద్వారా సమాచారం వచ్చిందన్న ఎస్పీ
  • 7 రోజుల్లో చార్జిషీటు వేస్తామని వెల్లడి
విజయనగరం జిల్లా చౌడువాడలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చౌడువాడ ఘటన నిందితుడు రాంబాబు దొరికాడని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ వెల్లడించారు. నిందితుడ్ని మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఘటన గురించి చెబుతూ, దిశ యాప్ కాల్ ద్వారా తమకు సమాచారం వచ్చిందని వెల్లడించారు. పోలీసులు సకాలంలో స్పందించి బాధితురాలిని కాపాడారని పేర్కొన్నారు.

రాంబాబు 8 నెలల కిందట రాములమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అయితే ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని కక్ష పెంచుకున్నాడని వివరించారు. రాములమ్మపై అర్ధరాత్రి వేళ పెట్రోల్ పోసి హత్యాయత్నం చేశాడని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై 7 రోజుల్లో చార్జిషీటు వేస్తున్నామని వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు ముమ్మరం చేశామని వివరించారు.


More Telugu News