చిరంజీవి ఇంట వరలక్ష్మీ వ్రతం వేడుక... ఫొటో ఇదిగో!
- నేడు వరలక్ష్మీ వ్రతం పండుగ
- తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ
- వ్రతం ఆచరించిన అంజనాదేవి, సురేఖ, ఉపాసన
- ఫొటో పంచుకున్న ఉపాసన
ఇవాళ వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన శుక్రవారం సందర్భంగా మహిళలు ఈ వ్రతం ఆచరిస్తారు. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు వరలక్ష్మీ వ్రత శోభ వెల్లివిరుస్తోంది.
తాజాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం కళ ఉట్టిపడింది. ఈ పుణ్యదినాన చిరంజీవి నివాసంలోనూ వరలక్ష్మి వ్రతం ఆచరించారు. దీనికి సంబంధించిన ఫొటోను రామ్ చరణ్ అర్ధాంగి కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ ఫొటోలో అంజనాదేవి, సురేఖ, ఉపాసన, శ్రీజ కుమార్తె దర్శనమిచ్చారు. కొణిదెల వారింట నాలుగు తరాల స్త్రీలు కలిసి వరలక్ష్మి వ్రతం ఆచరించిన వేళ అంటూ ఉపాసన ఈ ఫొటోపై వ్యాఖ్యానించారు.