రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఉద్ధవ్ థాకరే

  • 1944 ఆగస్టు 20న జన్మించిన మాజీ ప్రధాని
  • ఈరోజు ఆయన 77వ జయంతి
  • ముఖ్యమంత్రి ఇంట్లోనే జరిగిన కార్యక్రమం
రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది. 1984లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హత్యతో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాజీవ్ గాంధీ అందుకున్నారు. ఆ తర్వాత తన 40 ఏళ్ల వయసులో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయసులో ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1944 ఆగస్టు 20 న జన్మించిన రాజీవ్ గాంధీ.. 1991 మే 21న తమిళనాడులో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో శ్రీపెరుంబదూర్‌లో ఉండగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) బృందానికి చెందిన ఆత్మాహుతి దళం చేసిన దాడిలో ఆయన మరణించారు.


More Telugu News