18 విపక్ష పార్టీలతో సోనియా సమావేశం.. రెండు పార్టీలకు అందని ఆహ్వానం
- బీజేపీ ఓటమే లక్ష్యంగా భేటీ
- వర్చువల్ గా కొనసాగుతున్న సమావేశం
- ఆప్, అకాలీదళ్ పార్టీలకు అందని ఆహ్వానం
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివిధ పార్టీల నేతలతో ఈ రోజు భేటీ అయ్యారు. వర్చువల్ గా జరుగుతున్న ఈ సమావేశానికి 19 పార్టీలు హాజరయ్యాయి. హాజరైన పార్టీల్లో టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, సీపీఐ, సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్, విడుతలై చిరుతైగల్ కట్చి, ఎల్జేడీ, జేడీఎస్, ఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్, పీడీపీ, ఐయూఎంఎల్ ఉన్నాయి.
ఆప్, అకాలీదళ్ పార్టీలకు ఆహ్వానం అందలేదు. బీజేపీని ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.
ఆప్, అకాలీదళ్ పార్టీలకు ఆహ్వానం అందలేదు. బీజేపీని ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.