నిలువెత్తు ‘మానవ రోబో’ తయారీకి టెస్లా ప్లాన్.. వెల్లడించిన ఎలాన్ మస్క్
- 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో టెస్లా బాట్
- ప్రమాదకర పనుల్లో వినియోగానికి అనువు
- నమూనాను మాత్రమే వెల్లడించిన మస్క్
లగ్జరీ కార్ల తయారీ సంస్థ టెస్లా మానవ రోబోను తయారు చేయనుంది. నిన్న నిర్వహించిన కృత్రిమ మేధ (ఏఐ) కార్యక్రమంలో ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘టెస్లా బాట్’ పేరుతో దానిని మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఈ టెస్లాబాట్ కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
టెస్లా ఆటోపైలట్ సాఫ్ట్ వేర్ ఆధారంగా రోబోకు రూపునిచ్చినట్టు చెప్పారు. టాస్క్ లు చేయడం కోసం న్యూరల్ నెట్ వర్క్ కు సమాచారాన్ని పంపించేందుకు గానూ 8 కెమెరాలను అందులో పొందుపరిచారు. ఆ కెమెరాలు పంపించే సమాచారం ఆధారంగా ముందు వెనకా ఏమున్నాయో అంచనా వేస్తూ న్యూరల్ నెట్ వర్క్ పనులను చేస్తుంటుంది. మన మెదడు నిర్వహించే కార్యాలను చేస్తుంది.
పదే పదే చేయాల్సిన, ప్రమాదకర పనుల కోసం టెస్లాబాట్ ను వినియోగించుకోవచ్చని మస్క్ చెప్పారు. ఎదుటి వారి నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈ రోబో ఎలా పనిచేస్తుందన్నదే ఇప్పుడున్న అసలైన సవాల్ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ లో ఆర్థిక పురోగమనానికి ఇలాంటి టెక్నాలజీలు ఎంతో దోహదం చేస్తాయని, ప్రమాదకర పనుల్లో మనుషుల అవసరాలను తగ్గిస్తాయని ఆయన వివరించారు. ప్రస్తుతానికి టెస్లాబాట్ ఎలా ఉంటుందో చూపించే నమూనాను మాత్రమే వెల్లడించారు. దాని ప్రొటోటైప్ ను వచ్చే ఏడాది నాటికి తయారు చేస్తామన్న మస్క్.. ఎప్పుడు విడుదల చేస్తారన్న కచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు.
ఇవీ టెస్లాబాట్ ప్రత్యేకతలు...

- ఎత్తు: 5 అడుగుల 8 అంగుళాలు
- బరువు: సుమారు 57 కిలోలు
- వేగం: గంటకు 8 కిలోమీటర్లు
- బరువులు మోసుకెళ్లే సామర్థ్యం: 20.5 కిలోలు
- డెడ్ లిఫ్ట్ (నడుమును వంచి బరువులను పైకెత్తగలిగే సామర్థ్యం): 68 కిలోలు