ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి పూట కర్ఫ్యూను మరోసారి పొడిగించిన సర్కారు
- కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో నిర్ణయం
- సెప్టెంబర్ 4 వరకు పొడిగింపు
- ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదన్న విషయం తెలిసిందే. వైరస్ విజృంభణ తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 4 వరకు ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని , రాత్రి సమయంలో కరోనా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా, ఏపీలో ప్రతిరోజు దాదాపు 1,500 కేసులు నమోదవుతోన్న విషయం తెలిసిందే.