రాజకీయాల్లో మహిళలకు అవకాశంపై రిపోర్టర్ ప్రశ్నిస్తే పగలబడి నవ్విన తాలిబన్లు!
- ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన
- తాలిబన్ నేతలను ఇంటర్వ్యూ చేసిన మహిళా రిపోర్టర్
- మహిళల రాజకీయ ప్రవేశంపై ప్రశ్న
- నవ్వొస్తోందంటూ కెమెరా నిలిపివేయించిన తాలిబన్లు
మూర్ఖత్వానికి ప్రతీకలుగా తాలిబన్ల గురించి చెప్పుకుంటారు. అలాంటి వారి దృష్టిలో మహిళల స్థానం ఏంటో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. తాజాగా ఓ మహిళా రిపోర్టర్ కొందరు తాలిబన్ నేతలను ఇంటర్వ్యూ చేసింది. ఆఫ్ఘన్ ప్రస్తుత పరిస్థితులపై వారిని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలన్నింటికి వారు సజావుగానే సమాధానం చెప్పారు. మహిళల హక్కుల గురించి ప్రశ్నిస్తే షరియా చట్టం ప్రకారం వర్తింపజేస్తామని అన్నారు.
ఈ క్రమంలో, మహిళా రాజకీయనేతలు ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్య పదవులు చేపట్టడం మీకు సమ్మతమేనా? అని ఆ రిపోర్టర్ ప్రశ్నించడంతో, ఆ తాలిబన్ నేతలు పగలబడి నవ్వారు. అంతేకాదు, "మాకు నవ్వొస్తోంది" అంటూ మీడియా కెమెరాను కూడా నిలిపివేయించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.