పాకిస్థాన్ లో మత ఉత్సవాలపై బాంబు దాడి
- ముగ్గురి దుర్మరణం, 50 మందికి గాయాలు
- మొహర్రం నెలలో ఏటా జరిగే అషుర వేడుకలు
- వీటిపై సున్నీ ఛాందసవాదుల కన్నెర్ర
- బలమైన భద్రత ఏర్పాట్లు చేసినా దాడి
పాకిస్థాన్ లో మత వేడుకలు చేసుకుంటున్న ఒక బృందంపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు దుర్మరణం పాలవగా, 50 మంది వరకూ గాయపడినట్లు అధికారులు తెలిపారు. పాక్‌లో మతపరంగా మైనార్టీలైన షియాటే ముస్లింలు ఏటా మొహర్రం నెలలో అషుర వేడుకలు చేసుకుంటారు.
680వ సంవత్సరంలో జరిగిన కర్బాలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనుమడైన హుస్సేన్ మృతి చెందారు. ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా అషుర ఉత్సవాలను షియాటే ముస్లింలు జరుపుకుంటారు. అయితే సున్నీ ఛాందసవాదులు ఈ వేడుకలను అంగీకరించరు. ఈ నేపథ్యంలో షియాటే ముస్లింలకు సంబంధించిన కొన్ని కట్టడాలు, అషుర ఉత్సవాలపై పలుమార్లు సున్నీ ఛాందసవాద బృందాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ వేలమంది మరణించారు.
తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవాల్‌నగర్‌లో జరుగుతున్న ఉత్సవాలపై బాంబు దాడి జరిగింది. ఈ ఉత్సవాలకు పోలీసులు బలమైన భద్రత కల్పించారు. మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేశారు. ఈ బాంబు పేలుడు ఎలా జరిగిందనే అంశంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తీవ్రమైన గాయాలతో రోడ్డుపై పడి ఉన్న షియాటే ముస్లింలకు స్థానికులు సాయం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.