గాలి జనార్దన్ రెడ్డికి ఊరట.. బెయిల్ నిబంధనలు సడలించిన సుప్రీంకోర్టు

  • పలు ప్రాంతాల్లో పర్యటనకు అనుమతి కోరిన గాలి
  • విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
  • మూడు ప్రాంతాల్లో పర్యటనకు అనుమతి
  • ఎస్పీలకు సమాచారం అందించాలని ఆదేశం
మైనింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కర్ణాటక వ్యాపార దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ నిబంధనలను సుప్రీం కోర్టు సడలించింది. 8 వారాల పాటు బళ్లారి, కడప, అనంతపురంలో పర్యటించేందుకు అనుమతించింది. 3 ప్రాంతాలకు రాకపోకల గురించి ఆయా ప్రాంతాల జిల్లా ఎస్పీలకు సమాచారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అటు, గాలి జనార్దన్ రెడ్డిపై ఉన్న మైనింగ్ కేసుల్లో త్వరగా విచారణ పూర్తి చేయాలంటూ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వాదనల సందర్భంగా సీబీఐ... బళ్లారి, కడప, అనంతపురంలో గాలి జనార్దన్ రెడ్డి పర్యటనలకు అభ్యంతరం లేదని తెలిపింది. అయితే బెయిల్ షరతులు పూర్తిగా మార్చవద్దని కోర్టును కోరింది. ఈ కేసులో జనార్దన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహాత్గీ, రంజిత్ కుమార్ వాదించారు.


More Telugu News