అక్కడ ‘మా’తో పాటు 24 క్రాఫ్టుల కార్యాలయాలు కట్టుకోవచ్చు.. పెద్దదిక్కు చిరంజీవి ముందుకు రావాలి: వల్లభనేని అనిల్ కుమార్
- ఫిలిం ఛాంబర్ లోని స్థలాన్ని ఉపయోగించుకోవాలి
- అక్కడ బిల్డింగ్ కట్టుకుంటే అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు
- దీని కోసం అగ్ర హీరోలు, పరిశ్రమ పెద్దలు కలిసి నిర్ణయం తీసుకోవాలి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్న వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పోటీదారులపై విమర్శలు కూడా ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా 'మా' అసోసియేషన్ కు శాశ్వత భవన నిర్మాణంపైనే ఇప్పుడు ఎక్కువ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఓ సలహా ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలోని స్థలాన్ని అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఉపయోగించుకోవాలని చెప్పారు.
ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో రామానాయుడు కల్యాణమండపం ముందు ఉన్న స్థలంలో అద్భుతమైన బిల్డింగ్ కట్టుకోవచ్చని... ఆ బిల్డింగ్ లో 'మా' అసోసియేషన్ కార్యాలయంతో పాటు, 24 క్రాఫ్టుల కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. దీనివల్ల సినీ పరిశ్రమ మొత్తం ఒకే చోట ఉండేందుకు వీలవుతుందని చెప్పారు. దీనికోసం అగ్ర హీరోలు, పరిశ్రమ పెద్దలు అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటి చిరంజీవి ముందుకు రావాలని కోరారు.