నకిలీ చలాన్ల అంశంపై తీవ్రస్థాయిలో స్పందించిన సీఎం జగన్!

  • సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నకిలీ చలాన్లు
  • పలు జిల్లాల్లో బయటపడ్డ భాగోతం
  • ఈ స్థాయిలో తప్పులు ఎలా జరుగుతున్నాయన్న సీఎం
  • చలాన్ల చెల్లింపులను పరిశీలించాలని ఆదేశం
ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో నకిలీ చలాన్ల అంశం తీవ్ర కలకలం రేపింది. దీనిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏసీబీ దర్యాప్తు చేస్తే తప్ప ఈ వ్యవహారం బయట పడలేదు... ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే ఎందుకు మన దృష్టికి రాలేదు? వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో లేదో ఎందుకు చూడడంలేదు? అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

నకిలీ చలాన్ల అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. ఇకమీదట అన్ని కార్యాలయాల్లో చలాన్ల చెల్లింపు ప్రక్రియ పరిశీలించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మీ-సేవా పరిస్థితులపైనా పర్యవేక్షణ ఉండాలని నిర్దేశించారు. వారం, పది రోజులకోసారైనా అధికారులు సమావేశం అవుతుండాలని ఆదేశించారు.


More Telugu News