గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడం లేదు: అచ్చెన్నాయుడు
- గోరంట్లతో మాట్లాడిన అచ్చెన్నాయుడు, వాసిరెడ్డి రాంబాబు
- గోరంట్ల ఇంటికి వెళ్లిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
- సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకుంటామన్న నల్లమిల్లి
తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయబోతున్నారనే వార్త కలకలం రేపుతోంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు ఫోన్ చేశారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సముదాయించారు. మరోవైపు బుచ్చయ్య చౌదరితో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, పార్టీకి బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడం లేదని చెప్పారు. రాజమండ్రి డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కూడా గోరంట్ల రాజీనామా చేయడం లేదని తెలిపారు.
మరోవైపు గోరంట్ల రాజీనామా చేయబోతున్నారనే వార్త తెలియగానే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా గోరంట్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోరంట్లతో అన్ని విషయాలను మాట్లాడామని, ఆయన రాజీనామా చేయబోరని చెప్పారు. ఏ సమస్యలున్నా పార్టీలో అంతర్గతంగా పరిష్కరించుకుంటామని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు గోరంట్ల అని కొనియాడారు.