టీడీపీకి రాజీనామా అంటూ వస్తున్న వార్తలపై మాట్లాడేందుకు నిరాకరించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- గోరంట్ల రాజీనామా అంటూ కథనాలు
- వివరణ కోరిన మీడియా వర్గాలు
- ఇప్పుడేమీ మాట్లాడబోనన్న గోరంట్ల
- అంతకుమించి స్పందించేందుకు విముఖత
సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో, మీడియా కథనాలపై రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం పట్ల ఇప్పుడేమీ వివరణ ఇవ్వనని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరినప్పటికీ, అంతకుమించి మాట్లాడేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.
కాగా, స్థానిక నాయకత్వం, అనుబంధ కమిటీల వ్యవహారంలో గోరంట్ల కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అటు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.