కేసీఆర్‌పై ఈటల రాజేంద‌ర్ మండిపాటు

  • కేసీఆర్ ప్రతిష్ఠ, గౌరవం మసకబారాయి 
  • సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌దే
  • కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా దళితబంధు ప‌థ‌కాన్ని అమలు చేయాలి
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఆ నియోజ‌క‌వర్గంలో కీల‌క పార్టీల నేత‌లు ప‌ర్య‌ట‌న‌లు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌త్య‌ర్థి పార్టీలపై నేత‌లు మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. ఉప‌ ఎన్నిక‌ నేప‌థ్యంలో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై  బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిప‌డ్డారు.

హుజూరాబాద్ లో తిరిగి త‌న ప‌ర్య‌ట‌న ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... ఆయ‌న‌ ప్రతిష్ఠ, గౌరవం మసకబారాయని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌దేనని ఆరోపించారు. ఆయ‌న‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా దళితబంధు ప‌థ‌కాన్ని అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల వేత‌నాలు, పెన్ష‌న‌ర్ల‌కే రూ.40 వేల కోట్లు చెల్లించాలని ఆయ‌న చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీయే గెలుస్తుంద‌ని అన్నారు.


More Telugu News