రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్న కత్రినా కైఫ్?
- విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉన్న కత్రినా
- రెండేళ్లుగా వీరి రిలేషన్ షిప్ పై ప్రచారం
- రోకా ఫంక్షన్ లో ఉంగరాలు మార్చుకున్నారని సమాచారం
బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందంటూ బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా కత్రినా, నటుడు విక్కీ కౌశల్ ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొంత కాలంగా బాలీవుడ్ మీడియా వరుస కథనాలను ప్రచురిస్తోంది. తాజాగా జరిగిన రోకా ఫంక్షన్ లో కత్రినా, విక్కీ కౌశల్ లు ఉంగరాలు మార్చుకున్నారంటూ ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది. మరోవైపు, వీరిద్దరికీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
గత రెండేళ్లుగా కత్రినా, విక్కీ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. న్యూఇయర్ పార్టీ కోసం వీరిద్దరూ మాల్దీవులకు వెళ్లారు. అక్కడ ప్రైవేటు పార్టీలు, వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో, వీరి రిలేషన్ షిప్ కు సంబంధించిన వార్తలకు మరింత బలం వచ్చింది. మరోవైపు ఓ టీవీ షోలో సోనమ్ కపూర్ సోదరుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ మాట్లాడుతూ... కత్రినా, విక్కీ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని సంచలన ప్రకటన చేశారు.