అష్రఫ్ ఘనీ రూ. 1255 కోట్లతో పారిపోయారంటూ తజకిస్థాన్‌లోని ఆఫ్ఘన్ రాయబారి సంచలన ఆరోపణ
- దేశం నుంచి డబ్బు తీసుకుని విద్రోహిలా పరారయ్యారు
- ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి
- ఇంటర్‌పోల్‌కు త్వరలో వినతి పత్రం ఇస్తా
కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో పరారైన ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీపై తజకిస్థాన్‌లోని ఆప్ఘనిస్థాన్ రాయబారి మొహమ్మద్ జహీర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోతూ దేశ ఖజానా నుంచి రూ. 1,255 కోట్లు (169 మిలియన్ అమెరికన్ డాలర్లు) తస్కరించారని ఆరోపించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని ఇంటర్‌పోల్‌ను డిమాండ్ చేశారు.
నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. దేశం నుంచి డబ్బు తీసుకుని ఓ విద్రోహిలా ఘనీ యూఏఈకి పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘనీని అరెస్ట్ చేయాలంటూ త్వరలోనే ఇంటర్‌పోల్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు.