ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన మూడు మిలటరీ శునకాలు
- 2019లో కాబూల్‌లో విధుల్లో చేరిన స్నిఫర్ డాగ్స్
- హర్యానాలోని ఎన్‌టీడీసీ భాను శిక్షణా శిబిరంలో ట్రైనింగ్
- భారత దౌత్యవేత్తలతోపాటు ఎంబసీలో పనిచేసే ఆఫ్ఘన్ పౌరులనూ కాపాడిన జాగిలాలు
ఆఫ్ఘనిస్థాన్‌లో మూడేళ్ల పాటు సేవలందించిన మూడు శునకాలు తిరిగి భారత్‌కు చేరుకున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ)కి చెందిన కే9 జాగిలాలు - మాయ, బాబీ, రూబిలను 2019లో కాబూల్ పంపించారు. వీటికి హర్యానాలోని ఎన్‌టీడీసీ భాను శునక శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇది దేశంలోని అత్యుత్తమ శునక శిక్షణా కేంద్రాల్లో ఒకటి.
భారత వాయుసేకు చెందిన సీ-17 ఎయిర్‌క్రాప్ట్‌లో ఈ శునకాలను కాబూల్ నుంచి గుజరాత్ తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక్కడి జామ్ నగర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఆ విమానం ల్యాండయింది. బుధవారం ఈ శునకాలు ఢిల్లీలోని ఐటీబీపీ చావాలా క్యాంపుకు చేరుకున్నాయి. మూడేళ్ల పాటు భారత రాయబార కార్యాలయంలో అధికారులతోపాటు, అక్కడ పనిచేసే ఆఫ్ఘన్ పౌరులకు ఇవి రక్షణ కల్పించాయి.