ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి ఆశ్రయం కల్పించిన యూఏఈ

  • దేశాన్ని విడిచి వెళ్లిపోయిన అష్రఫ్ ఘనీ
  • ఆయనకు, ఆయన కుటుంబానికి ఆశ్రయం ఇచ్చామన్న యూఏఈ
  • ఏ నగరంలో ఉన్నారనే విషయాన్ని వెల్లడించని వైనం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు చుట్టుముట్టడానికి ముందు ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఏ దేశంలో ఉన్నారనే విషయంలో ఇప్పటి వరకు పలు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక ప్రకటన చేసింది.

అష్రఫ్ ఘనీకి, ఆయన కుటుంబానికి తాము ఆశ్రయం ఇచ్చామని యూఏఈ ప్రకటించింది. అయితే దేశంలోని ఏ నగరంలో ఆయన ఉన్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. మరోవైపు, ఆఫ్ఘన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తాలిబన్లు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మాజీ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. రెండు, మూడు రోజుల్లో అక్కడ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


More Telugu News