మెగా హీరో పాన్ ఇండియా మూవీలో 'పుష్ప' విలన్?
- 'పుష్ప'లో విలన్ గా ఫహద్ ఫాజిల్
- కమల్ 'విక్రం' సినిమాలో కీలక పాత్ర
- శంకర్, చరణ్ సినిమాలో అవకాశం
ఫహద్ ఫాజిల్ కు మలయాళంలో మంచి ఆర్టిస్టుగా పేరుంది. అందుకే, ఇతర భాషల నుంచి కూడా ఆయనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో నాగార్జునతో 'కిల్లర్' చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడైన ఫహద్.. ఇప్పటికే తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు. తెలుగులో ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న 'పుష్ప' సినిమాలో ప్రధాన విలన్ పాత్రను పోషిస్తూ, టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. మరోపక్క తమిళంలో కమలహాసన్ నటిస్తున్న 'విక్రమ్' సినిమాలో కూడా విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఈ క్రమంలో తెలుగులో మరో భారీ చిత్రంలో నటించే అవకాశం తాజాగా ఫహద్ కు వచ్చినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.
ఇక ఇందులో విలన్ పాత్రకు ఫహద్ ను అడుగుతున్నట్టు సమాచారం. మంచి అవకాశం కావడంతో ఈ సినిమా చేయడానికి ఆయన కూడా ఆసక్తి చూపుతున్నట్టు చెబుతున్నారు. అలా తెలుగులో తన తొలి సినిమా 'పుష్ప' విడుదల కాకుండానే మరో సినిమాలో నటించే ఛాన్సును ఫహద్ అందుకున్నాడన్న మాట!