లాడ్జిలో 17 ఏళ్ల బాలికతో పాటు 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- నెల్లూరు జిల్లాలో కలకలం
- ప్రేమ వ్యవహారమే కారణం?
- బాలిక పరిస్థితి విషమం
నెల్లూరు జిల్లాలో కలకలం చెలరేగింది. బుచ్చిరెడ్డి పాలెంలోని ఓ లాడ్జిలో 42 ఏళ్ల ఓ వ్యక్తితో పాటు 17 ఏళ్ల ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రేమ వ్యవహారమే వారి ఆత్మహత్యాయత్నానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి పేరు రామయ్యగా పోలీసులు గుర్తించారు. అతనికి బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు జిల్లా వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.