కాబూల్‌లో చిక్కుకుపోయిన మంచిర్యాల వాసి.. కుటుంబం ఆందోళన
- 8 సంవత్సరాలుగా కాబూల్‌లో పనిచేస్తున్న రాజన్న
- నేడు స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు
- విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆందోళన
- సురక్షితంగా దేశం దాటించాలంటూ వేడుకోలు
తాలిబన్ల వశమై అల్లకల్లోలంగా మారిన ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసి గురించి ఆయన కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. మంచిర్యాలకు చెందిన బొమ్మన రాజన్న ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఏసీసీఎల్ అనే సంస్థలో 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. జూన్ 28న స్వగ్రామానికి వచ్చిన రాజన్న ఈ నెల 7న తిరిగి కాబూల్ చేరుకున్నాడు. ప్రస్తుతం కాబూల్‌లో పరిస్థితులు దారుణంగా ఉండడంతో అక్కడి నుంచి బయటపడే దారి కనిపించక ఆందోళన చెందుతున్నాడు.
రాజన్నతోపాటు కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన వెంకన్న కూడా అక్కడే ఉన్నాడు. ఈ నెల 18న (నేడు) వీరిని ఇండియా పంపేందుకు సంస్థ టికెట్లు కూడా బుక్ చేసింది. అయితే, కాబూల్ నుంచి వాణిజ్య విమానాల సేవలు నిలిచిపోవడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా దేశం నుంచి తరలించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరోవైపు, రాజన్న కుటుంబం కూడా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆయనను సురక్షితంగా స్వగ్రామం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది.