ఖతర్‌‌ను వీడి.. ఆఫ్ఘనిస్థాన్‌కు పయనమైన తాలిబన్ అగ్రనేత!

  • ఖతర్ మంత్రితో బరాదర్ సమావేశం
  • ఆఫ్ఘన్‌లో తాజా పరిస్థితులు, అధికార మార్పిడిపై చర్చ
  • తాలిబన్లు ఆప్ఘన్‌ను స్వాధీనం చేసుకోవడం వెనక బరాదర్ వ్యూహం
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో తాలిబన్ అగ్రనేత, సైనిక వ్యూహకర్త ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నిన్న ఖతర్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ బయలుదేరినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఖతర్ విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్‌థనీ, అబ్దుల్ ఘనీ మధ్య కీలక సమావేశం జరిగింది. ఆఫ్ఘన్ తాజా పరిణామాలు, అధికార మార్పిడి, ప్రజా రక్షణ, కొత్త ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించడం.. వంటి అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది.

తాలిబన్ సహ వ్యవస్థాపకుడైన ముల్లా 'దోహా శాంతి' ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా వెళ్లిపోయిన తర్వాత తాలిబన్లు విరుచుకుపడి ఒక్కో రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగడం వెనక ఆయన వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో ఇన్నాళ్లూ ఖతర్‌లో ఉన్న ముల్లా ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌కు బయలుదేరినట్టు చెబుతున్నారు.


More Telugu News