నేనిచ్చిన డెడ్ లైన్ కి ఇంకా 19 రోజులే మిగిలుంది: లోకేశ్

  • గుంటూరులో రమ్య అనే విద్యార్థిని హత్య
  • 21 రోజుల్లో శిక్ష పడాలన్న లోకేశ్
  • దిశ చట్టం ప్రస్తావన
  • సోదరి రమ్యకు న్యాయం జరగాలని వ్యాఖ్యలు
గుంటూరులో బీటెక్ విద్యార్థి రమ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి దిశ చట్టం సాయంతో 21 రోజుల్లోనే శిక్ష వేస్తామని చెప్పారని వైసీపీ సర్కారును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "రమ్యను ఒక మృగాడు నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్యచేశాడు. నేనిచ్చిన డెడ్ లైన్ కు ఇంకా 19 రోజులే మిగిలుంది. దోషులకు ఏం శిక్ష వేయబోతున్నారు?" అంటూ ప్రశ్నించారు.

సోదరి రమ్యకు న్యాయం జరగాలని, దిశ చట్టం ద్వారా హంతకుడికి 21 రోజుల్లో శిక్ష పడాలని లోకేశ్ స్పష్టం చేశారు. నిన్న లోకేశ్ పెదకాకాని పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడకపోతే ఆ మరుసటి రోజు నుంచే తమ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు.


More Telugu News