ఆఫ్ఘన్‌లో సంక్షోభం అమెరికా పుణ్యమే: చైనా విమర్శ
- తాలిబన్ ప్రభుత్వానికి సహకారం అందిస్తామన్న చైనా
- అర్థాంతరంగా ఆప్ఘన్ వీడటాన్ని సమర్థించుకున్న బైడెన్
- తీవ్రవాదుల అడ్డాగా ఆఫ్ఘనిస్థాన్ మారకూడదన్న చైనా ప్రతినిధి
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత సంక్షోభానికి అమెరికానే కారణమని చైనా ఆరోపించింది. ఆఫ్ఘనిస్థాన్‌ను భయంకరమైన అయోమయంలో ఉంచి అమెరికా బలగాలు వెళ్లిపోయాయని డ్రాగన్ దేశం అంటోంది. ఈ క్రమంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని పూర్తిగా తమ స్వాధీనం చేసుకున్నారని చెప్పింది.
అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌ను వీడిన తర్వాత తాలిబన్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత తాలిబన్ దళాలు వేగంగా ఆఫ్ఘనిస్థాన్‌ను తమ వశం చేసుకున్నాయి. అయితే అమెరికా దళాలు అర్థాంతరంగా వెళ్లిపోయి, ఆఫ్ఘనిస్థాన్‌లో ఇలాంటి పరిస్థితులు సృష్టించడంపై బైడెన్ మాట్లాడుతూ.. తన నిర్ణయం సరైందేనని అన్నారు. ఆఫ్ఘన్ సైనికులు తమ కోసం తాము పోరాడలేదని, అందుకే ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోయిందని ఆయన విమర్శించారు.
అయితే చైనా మాత్రం ఆఫ్ఘన్ సంక్షోభానికి అమెరికానే కారణమని అంటోంది. అలజడి, భేదభావం, నాశనమైన కుటుంబాలు.. ఇవే అమెరికా మిగిల్చిందని చైనా ఆరోపించింది. ‘అమెరికా శక్తి, పాత్ర రెండూ నాశనంలోనే కానీ, నిర్మాణంలో ఎక్కడా ఉపయోగపడలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు.
నేడు మీడియాతో మాట్లాడిన ఆమె అమెరికాపై విమర్శల వర్షం కురిపించారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి చైనా అంగీకరించింది. ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో సాయం చేస్తామని చైనా హామీ ఇచ్చింది. అయితే ఇక్కడ మరోసారి తీవ్రవాదులు చేరకుండా చూసుకోవాలని తాలిబన్లకు సూచించింది.