ఓపెన్ టాప్ వాహనంపై ఆరు గంటల పాటు ఊరేగింపు... ఆసుపత్రిపాలైన ఒలింపిక్ పసిడి విజేత నీరజ్ చోప్రా
- ఇటీవల చోప్రాకు జ్వరం
- పూర్తిగా కోలుకోకుండానే పలు కార్యక్రమాలకు హాజరు
- ఊరేగింపులో సొమ్మసిల్లిన వైనం
- హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసుపత్రి పాలయ్యాడు. ఢిల్లీ నుంచి పానిపట్ వరకు దాదాపు 6 గంటలపాటు ఓపెన్ టాప్ వాహనంపై ఊరేగింపులో పాల్గొన్న నీరజ్ చోప్రా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
చోప్రా గత కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఒలింపిక్ పతక విజేతలతో నిర్వహించిన కార్యక్రమాలకు, సాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చోప్రా జ్వరంతోనే హాజరయ్యాడు. అయితే, అందరికీ తన పతకం చూపిస్తూ స్వగ్రామానికి ఊరేగింపుగా వెళుతుండగా, నీరజ్ చోప్రా సొమ్మసిల్లాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.