కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం మూతపడలేదు: కేంద్రం

  • ఆఫ్ఘన్ నుంచి భారత పౌరుల తరలింపు
  • స్పష్టత నిచ్చిన కేంద్రం
  • భారత ఎంబసీ సేవలు కొనసాగుతున్నట్టు వెల్లడి
  • భారత్ వచ్చేందుకు 1,650 మంది దరఖాస్తు
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత పౌరుల తరలింపు కార్యక్రమాలను కేంద్రం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో, భారత పౌరులకు మరింత స్పష్టత నిచ్చింది. కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం మూతపడలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత ఎంబసీలో సేవలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. 1,650 మంది భారత్ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

కాగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలింపు కార్యక్రమాల కోసం భారత్ తన సీ-17 రవాణా విమానాన్ని తజకిస్థాన్ లోని అయినీ ఎయిర్ బేస్ లో సిద్ధంగా నిలిపి ఉంచింది. కాబూల్ ఎయిర్ పోర్టు నియంత్రణను పర్యవేక్షిస్తున్న అమెరికా దళాల నుంచి క్లియరెన్స్ వచ్చిన మరుక్షణమే ఆఫ్ఘన్ వెళ్లనుంది. అవసరమైతే, చార్టర్డ్ విమానాలను కూడా అద్దెకు తీసుకోవాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది.


More Telugu News