అప్పు-నిప్పు పేరుతో కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తాం: సోము వీర్రాజు

  • సర్కారు అనవసరంగా అప్పులు చేస్తోందన్న సోము
  • తెలుగు భాష కోసం ఉద్యమిస్తామని వెల్లడి
  • ఆంగ్ల భాషను బలవంతంగా రుద్దుతున్నారని వ్యాఖ్యలు
  • కిషన్ రెడ్డి పర్యటన పోస్టర్ల ఆవిష్కరణ
రాష్ట్ర ప్రభుత్వం అనవసర అప్పులు చేస్తోన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అప్పు-నిప్పు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ అప్పుల వ్యవహారాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

అటు, తెలుగు భాష కోసం కూడా ఉద్యమిస్తామని సోము పేర్కొన్నారు. సీఎం ఆంగ్ల భాషను విద్యార్థులపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇక, రేపటి నుంచి రెండ్రోజుల పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో జన ఆశీర్వాద యాత్రలో పాల్గొంటారని సోము వీర్రాజు వెల్లడించారు. కిషన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.

అంతకుముందు, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను సోము వీర్రాజు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలను ఆయనకు పరిచయం చేశారు.


More Telugu News