నారా లోకేశ్ పై పాత గుంటూరు పీఎస్ లో కేసు నమోదు

  • గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య
  • ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ నేతలు
  • ఉద్రిక్తతల నడుమ లోకేశ్ అరెస్ట్
  • నిన్న సాయంత్రానికి విడుదల
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యేలు నక్కా శ్రవణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్రపై కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మొత్తం 33 మందిపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య అనంతరం ఆమె కుటుంబాన్ని లోకేశ్ సహా ఇతర టీడీపీ నేతలు నిన్న పరామర్శించేందుకు రాగా, తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా లోకేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, సాయంత్రానికి ఆయన్ను విడుదల చేశారు. లోకేశ్ కు 151 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.

రాజకీయ పక్షాల తీరు అభ్యంతరకరమంటూ వ్యాఖ్యానించిన ఇనార్జి డీఐజీ రాజశేఖర్, కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే లోకేశ్, తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో లోకేశ్ పై 341, 353, 147ఆర్/డబ్ల్యూ, 149ఆర్/డబ్ల్యూ, 120బి సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.


More Telugu News