వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రిని విచారిస్తున్న సీబీఐ
- 72వ రోజుకు చేరిన సీబీఐ విచారణ
- ఈరోజు విచారణ జరుపుతున్న రెండు బృందాలు
- హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న అవినాశ్ తండ్రి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. విచారణ 72వ రోజుకు చేరుకుంది. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి అనుమానితుడిగా ఉన్నారు.
మరోవైపు కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ లో సీబీఐకి చెందిన మరో విచారణ బృందం విచారణ చేపట్టింది. ఈ విచారణకు జగదీశ్వర్ రెడ్డి, భరత్ కుమార్ హాజరయ్యారు. వీరిలో భరత్ కుమార్ సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ కు బంధువు అవుతారు. జగదీశ్వర్ రెడ్డి వైఎస్ వివేకా పొలం పనులు చూసేవారు.