ఆఫ్ఘ‌న్ నుంచి ఇండియాకు రాగానే సంతోషంతో 'భార‌త్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేసిన భార‌తీయులు.. వీడియో ఇదిగో

  • ఆఫ్ఘ‌నిస్థాన్‌లో దారుణ ప‌రిస్థితులు
  • కాబూల్‌లో ఉన్న ఎంబ‌సీల‌న్నీ ఖాళీ
  • భార‌తీయ రాయ‌బార కార్యాల‌య సిబ్బందిని తీసుకొచ్చిన కేంద్రం
ఆఫ్ఘ‌నిస్థాన్‌లో దారుణ ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో కాబూల్‌లో ఉన్న ఎంబ‌సీల‌న్నీ ఖాళీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో భార‌తీయ రాయ‌బార కార్యాల‌య సిబ్బందిని కూడా త‌రలించి భార‌త్ తీసుకువ‌చ్చారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో విమానం దిగిన అనంత‌రం వారందరినీ ఓ బ‌స్సులో తరలించారు.  

ఇక భార‌త్ చేరుకున్న నేప‌థ్యంలో వారంతా భార‌త్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. స్వ‌దేశానికి వ‌చ్చినందుకు వారంతా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా, ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ప‌రిస్థితుల‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తాలిబ‌న్లు ఆ దేశాన్ని ప‌రిపాలించ‌నున్న నేప‌థ్యంలో క‌ఠిన చ‌ట్టాలు, నిబంధ‌న‌లు అమ‌ల‌య్యే అవ‌కాశం ఉంది.


More Telugu News