ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో మరో రెండు చార్జిషీట్ల దాఖలు
- వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో దాఖలు చేసిన ఈడీ
- సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా విచారణ జరిపిన ఈడీ
- మనీలాండరింగ్ అభియోగాలతో చార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ
- ఇప్పటికే ఏడు ఈడీ చార్జిషీట్లపై విచారణ జరుపుతోన్న సీబీఐ, ఈడీ కోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టులో మరో రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈ చార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ అభియోగాలతో చార్జిషీట్లు దాఖలు చేశారు. కాగా, ఇప్పటికే ఏడు ఈడీ చార్జిషీట్లపై సీబీఐ, ఈడీ కోర్టు విచారణ జరుపుతోంది.