'భీమ్లా నాయక్' నుంచి రానున్న రానా టీజర్!

'భీమ్లా నాయక్' నుంచి రానున్న రానా టీజర్!
  • మలయాళ రీమేక్ గా 'భీమ్లా నాయక్'
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ 
  • మరో ప్రధాన పాత్రలో రానా
  • జనవరి 12వ తేదీన విడుదల
పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' రూపొందుతోంది. మలయాళ రీమేక్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరే 'భీమ్లా నాయక్'. పవన్ పాత్ర ప్రధానంగా మొన్న ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఫస్టు గ్లింప్స్ లో రానా కనిపించకపోవడం పట్ల ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రానాకీ చోటు కల్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో సాధ్యమైనంత త్వరలోనే రానా పాత్ర ప్రధానంగా ఒక టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ కనిపించనుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  


More Telugu News