జీవోలు ఆన్ లైన్ లో పెట్టకూడదంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • 2008 నుంచి జీవోలను వెబ్ సైట్లలో పెడుతున్న వైనం
  • ఈ విధానానికి స్వస్తి పలికిన వైసీపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం పబ్లిక్ డొమైన్లో జీవోలు పెట్టకూడదని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులను (జీవోలను) ఇకపై ఆన్ లైన్ లో పెట్టకూడదని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్లో జీవోలను ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా ఈ ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే వచ్చింది.

తాజాగా ఈ విధానానికి స్వస్తి పలుకుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను వెబ్ సైట్లలో ఉంచొద్దని అన్ని శాఖల కార్యదర్శులకు మెమో పంపింది.


More Telugu News