లార్డ్స్ మైదానంలో టీమిండియా టెయిలెండర్ షమీ అర్ధసెంచరీ... మెరుగైన స్థితిలో భారత్
- 259కి చేరిన భారత్ ఆధిక్యం
- 108 ఓవర్లలో భారత్ స్కోరు 286/8
- 52 పరుగులతో ఆడుతున్న షమీ
- 30 పరుగులు చేసిన బుమ్రా
లార్డ్స్ టెస్టులో టీమిండియా ఆటగాళ్లు దృఢసంకల్పం కనబరుస్తున్నారు. ఓ దశలో మొగ్గు ఇంగ్లండ్ వైపే కనిపించినా, టెయిలెండర్ల పోరాటం భారత్ ను సురక్షిత స్థితిలో నిలిపింది. మహ్మద్ షమీ ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొని అర్ధసెంచరీ సాధించడం ఐదో రోజు ఆట తొలి సెషన్ లో హైలైట్. షమీకి బుమ్రా నుంచి విశేష సహకారం అందింది.
లంచ్ విరామానికి షమీ 52, బుమ్రా 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి చలవతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 108 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. తద్వారా 259 పరుగుల ఆధిక్యం సాధించింది. షమీ, బుమ్రా జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు అన్ని అస్త్రాలు ప్రయోగించినా ఫలితం దక్కలేదు.