జనగణమన రాక మధ్యలోనే ఆపేసిన ఎంపీ... వైరల్ అవుతున్న వీడియో

  • నిన్న స్వాతంత్ర్య దినోత్సవం
  • యూపీలోని మొరాదాబాద్ లోనూ పతాకావిష్కరణ
  • హాజరైన సమాజ్ వాదీ ఎంపీ ఎస్టీ హసన్
  • జాతీయగీతం మర్చిపోయిన వైనం
నిన్న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని గుల్ షహీద్ పార్క్ వద్ద కూడా పతాకావిష్కరణ చేయగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్టీ హసన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. పతాకావిష్కరణ అనంతరం ఎంపీ హసన్ బిగ్గరగా జనగణమన పాడుతూ అందరిలోనూ దేశభక్తి రేకెత్తించేందుకు ప్రయత్నించారు.

అయితే ఆయన జనగణమన మర్చిపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు. వింధ్య హిమాచల వరకు పాడి, ఇక గుర్తుకు రాకపోవడంతో దిక్కులు చూశారు. చివర్లో అందరితో పాటు జయహే జయహే అంటూ జాతీయగీతాన్ని ముగించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓ రేంజ్ లో ఎంపీని ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పట్రా పంచుకున్నారు.


More Telugu News