లార్డ్స్ టెస్టులో 200 దాటిన టీమిండియా ఆధిక్యం

  • ఆసక్తికరంగా లార్డ్స్ టెస్టు
  • రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్
  • 96 ఓవర్లలో 8 వికెట్లకు 233 రన్స్ 
  • 61 పరుగులు చేసిన రహానే 
లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టీమిండియా ఆధిక్యం 206 పరుగులకు చేరింది. డ్రింక్స్ అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ లో 96 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ షమీ (15 బ్యాటింగ్), జస్ప్రీత్ బుమ్రా (15 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు, అజింక్యా రహానే 61 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన పుజారా 206 బంతులు ఎదుర్కొని 45 పరుగులు చేయడం తెలిసిందే.

పంత్ 22 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా (3) విఫలమయ్యాడు. ఇషాంత్ శర్మ (16) విలువైన పరుగులు జోడించడంతో భారత్ స్కోరు 200 దాటింది. ఆటకు ఇవాళ చివరి రోజు కావడంతో ఫలితంపై భిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ డ్రా అవ్వొచ్చని, ఒక్కోసారి స్వల్ప టార్గెట్లను ఛేదించలేక జట్లు చతికిలపడిన సందర్భాలు ఉన్నాయని క్రికెట్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News