‘ఆల్ ద వెరీ బెస్ట్’.. అంటూ బోర్డుపై రాసిన సీఎం జగన్
- పి.గన్నవరం స్కూల్ సందర్శన
- అభివృద్ధి పనుల పరిశీలన
- తరగతి గదులన్నీ తిరిగి విద్యార్థులతో ముచ్చట్లు
- నాడు–నేడు రెండో విడత నిధుల విడుదల
ఎంతో కాలం నుంచి మూతపడిన బడులు ఏపీలో ఇవాళ తెరుచుకున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓ స్కూలుకు వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నారు. బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని పి. గన్నవరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠ్యపుస్తకాలను తిరగేసి, ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. స్కూల్ లో వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న స్కూల్ బ్యాగ్ ను భుజానికేసుకుని చూశారు. విద్యార్థులకు పెట్టే భోజనానికి సంబంధించిన మెనూను కూడా ఆయన పరిశీలించారు. ‘నాడు నేడు’ కార్యక్రమం తొలివిడత పనులు పూర్తయిన సందర్భంగా ఆయన పైలాన్ ను ఆవిష్కరించారు.
తొలివిడత కార్యక్రమంలో భాగంగా రూ.3,669 కోట్లతో 15,715 ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దామని జగన్ చెప్పారు. ఆ అభివృద్ధి పనులను విద్యార్థులకే అంకితం చేశారు. రెండో విడత పనుల కోసం జగనన్న విద్యా కానుక కింద రూ.731.30 కోట్లను విడుదల చేశారు.