పెగాస‌స్ క‌ల‌క‌లంపై అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

  • సుప్రీంకోర్టులో విచారణ
  • ఆరోప‌ణ‌ల‌ను తిర‌స్క‌రించిన కేంద్రం
  • క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని వివ‌ర‌ణ
పెగాస‌స్ క‌ల‌క‌లంపై సుప్రీంకోర్టు విచారణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో కేంద్ర ప్ర‌భుత్వం రెండు పేజీల‌ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. పెగాస‌స్ పై విచార‌ణ జ‌రిపేందుకు నిపుణుల క‌మిటీని వేయ‌నున్న‌ట్లు తెలిపింది.  

అలాగే, జ‌ర్న‌లిస్టు ఎన్‌.రామ్ స‌హా ప‌లువురు జ‌ర్న‌లిస్టులు చేసిన ఆరోప‌ణ‌ల‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు పేర్కొంది. జ‌ర్న‌లిస్టులు, రాజ‌కీయ నాయ‌కులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు, కోర్టు సిబ్బందిపై స్పైవేర్ నిఘా పెట్ట‌లేద‌ని తెలిపింది. పెగాస‌స్‌పై వ‌చ్చిన‌ పిటిష‌న్ల‌పై సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ సూర్యకాంత్‌, జస్టిస్ అనిరుద్ధ బోస్ తో కూడిన ధ‌ర్మాసనం విచార‌ణ జ‌రుపుతోంది.


More Telugu News