నీరజ్​ కు చూర్మా.. సింధుకు ఐస్​ క్రీం: ఒలింపిక్స్​ బృందంతో ప్రధాని ఆత్మీయ సమావేశం.. ఇవిగో ఫొటోలు

  • తన నివాసంలో ఒలింపిక్స్ బృందానికి బ్రేక్ ఫాస్ట్
  • ప్రతిఒక్కరితోనూ ప్రత్యేకంగా మాటామంతీ
  • పేరుపేరునా అభినందనలు చెప్పిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ భారత ఒలింపిక్స్ బృందంతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇవాళ ఉదయం ఆయన తన నివాసంలో వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడారు. 41 ఏళ్ల తర్వాత భారత్ కు పతకాన్ని తీసుకొచ్చిన హాకీ టీమ్ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, జట్టు సభ్యులు, వందేళ్లలో తొలిసారి భారత్ కు అథ్లెటిక్స్ లో పతకాన్ని అందించడమే కాకుండా స్వర్ణ పతకాన్ని గెలిచిన నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ లో కంచు పతకం గెలిచిన పీవీ సింధు.. ఇలా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు.


ఒలింపిక్స్ కు వెళ్లిన భారత బృందంతో ప్రధాని ఆత్మీయ సమావేశముంటుందని గత వారమే ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య దినోత్సవం కోసం ఎర్రకోటకు వారందరినీ ఆహ్వానించారు. ఇక నేటి ఉదయం ప్రధాని ఢిల్లీలోని తన నివాసంలో వారిని బ్రేక్ ఫాస్ట్ కు పిలిచారు. ఈ క్రమంలో ముందు చెప్పినట్టుగానే సింధుకు ఐస్ క్రీం, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు చూర్మాను ఆయన తినిపించారు. ప్రతి ఒక్క క్రీడాకారుడిని ఆయన అభినందించారు.




More Telugu News