ఆఫ్ఘన్ ప్రజలలో ఆందోళన.. ఏటీఎంలు, బ్యాంకుల ముందు భారీగా క్యూలు కట్టిన వైనం
- బ్యాంకుల్లో డబ్బుకు భద్రతపై ప్రజల్లో అనుమానాలు
- తాలిబన్లు అక్రమాలకు పాల్పడతారని భయం
- ఉపాధి కరవవుతుందని డబ్బు డ్రా
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఉగ్రవాదులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఆ తర్వాత తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని భావిస్తున్నారు. పాస్‌పోర్టు ఉన్నవారు చాలా మంది దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఉపాధి కరవవుతుందని, ఉద్యోగాలు కోల్పోతామని ఆఫ్ఘన్ ప్రజలు భావిస్తున్నారు.
మరోపక్క బ్యాంకులు, ఏటీఎంలలో ఉన్న తమ డబ్బును డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరి కనపడుతున్నారు. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు భరోసా లేకుండా పోతుందనే ఆందోళన కూడా వారిలో నెలకొన్నట్లు తెలుస్తోంది. వేలాది మంది ఇళ్లను వీడుతున్నారు. ఇళ్లపై ఉగ్రవాదులు దాడులు చేస్తారన్న భయంతో బహిరంగ ప్రదేశాలకు చేరుతున్నారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు ప్రజల స్వేచ్ఛను హరిస్తూ కఠిన ఆంక్షలు పెడతారనే భయం ఆ దేశ పౌరుల్లో నెలకొంది.