వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు: ముగిసిన‌ సునీల్ యాద‌వ్ క‌స్ట‌డీ

  • పులివెందుల కోర్టులో సునీల్‌ యాదవ్‌ను హాజరుపరచనున్న సీబీఐ
  • కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో కొన‌సాగుతోన్న విచార‌ణ‌
  • ప‌లువురు అనుమానితుల హాజ‌రు
మాజీ మంత్రి దివంగత‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో విచార‌ణ కొన‌సాగిస్తోన్న‌ కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) ఇటీవ‌ల ప్ర‌ధాన నిందితుడు సునీల్ కుమార్ యాద‌వ్‌ను గోవాలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న‌ను కోర్టులో ప్ర‌వేశ‌పెట్టిన‌ సీబీఐ కస్టడీలోకి తీసుకుని 10 రోజుల పాటు విచారించింది. కస్టడీ ముగియడంతో ఈ రోజు సునీల్ ను కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. అక్కడి కోర్టులో సునీల్‌ యాదవ్‌ను హాజరుపరచనున్నారు.  

మరోపక్క, కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో  సీబీఐ... అనుమానితులు, సాక్షుల‌ను విచారిస్తోంది. ఈ రోజు ముగ్గురిని విచారణకు పిలిచిన సీబీఐ అధికారులు వారిని ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే, పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జ‌రుగుతోన్న‌ విచారణకు వైఎస్‌ ప్రకాశ్‌రెడ్డి హాజరయ్యారు. వివేక‌ హ‌త్యకు సంబంధించి పలు కోణాల్లో వారిని ప్ర‌శ్నిస్తున్నారు. విచార‌ణ‌లో భాగంగా మరికొంత మంది అనుమానితులను అధికారులు విచారించే అవకాశం ఉంది.


More Telugu News