మిగతా రూ.41 లక్షలు ముక్కుపిండి వసూలు చేయాలి: వైఎస్ షర్మిల
- దళితులకు రావాల్సింది రూ.10 లక్షలు కాదు
- వారికి రూ.51 లక్షలు రావాలి
- ఏడేళ్ల కింద మూడెకరాల భూమి ఇస్తే దళితులు బాగుపడేవారు
- రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి కేసీఆర్ సరిపెట్టుకుంటున్నారు
హుజూరాబాద్ లో నేడు దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన దళితులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయనుంది. దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో దీనిపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు.
దళితులకు రావాల్సింది రూ.10 లక్షలు కాదని, వారికి రూ.51 లక్షలు రావాలని షర్మిల చెప్పారు. ఏడేళ్ల కింద మూడెకరాల భూమి ఇస్తే దళితులు బాగుపడేవారని ఆమె తెలిపారు. ఆ హామీని అమలు చేయట్లేదని విమర్శించారు. దళిత కుటుంబాలకు రూ.51 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి సీఎం కేసీఆర్ సరిపెట్టుకుంటున్నారని ఆమె అన్నారు. మిగతా రూ.41 లక్షలు కేసీఆర్ ముక్కుపిండి వసూలు చేయాలని పిలుపునిచ్చారు.