మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు
- ఢిల్లీలోని అటల్ సమాధి స్థల్‌లో ప్రముఖుల శ్రద్ధాంజలి
- వాజ్‌పేయి సేవలను గుర్తు చేసుకున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని
- వాజ్‌పేయి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్న రాష్ట్రపతి
భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని అటల్ సమాధి స్థల్‌లో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.
దేశానికి వాజ్‌పేయి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. దేశానికి వాజ్‌పేయి అందించిన సేవలను, ఆయన వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఎప్పటికీ ప్రజల మనసులో ఉండిపోతారని చెప్పారు.