తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. నేడు, రేపు అతి భారీ వర్షాలు

  • ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం
  • ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం
  • నిన్న అత్యధికంగా పెంట్లంలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం
తెలంగాణలో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నిన్న కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెంట్లంలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.


More Telugu News