మనం ఇంటర్నెట్ ఉపయోగిస్తుంటాం.. కానీ ఆ టెక్నాలజీ మనది కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

  • స్వావలంబనపై స్పందించిన ఆర్ఎస్ఎస్ చీఫ్
  • టెక్నాలజీ అంటే చైనా అని వ్యాఖ్యలు
  • స్వదేశీ అంటే ప్రతిదీ బహిష్కరించడం కాదని వెల్లడి
  • స్వావలంబనతో ఉపాధి పెరుగుతుందని వివరణ
స్వాతంత్ర్య దినోత్సవ వేళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్వావలంబనపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

"ఇవాళ మనందరం ఇంటర్నెట్ తో పాటు అనేక రూపాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. వాస్తవానికి వాటి వెనకున్న టెక్నాలజీ మనది కాదు, మనం బయటి నుంచి తెచ్చుకుంటున్నాం. టెక్నాలజీ అంటే మనం చైనా గురించి మాట్లాడుకోక తప్పదు. చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తుంటాం, మరి మీ మొబైల్ ఫోన్లలో వుండే ప్రతి వస్తువు ఎక్కడ్నించి వస్తోంది? ఒకవేళ మనం చైనాపై ఆధారపడడం మరింత పెరిగితే, వాళ్లకు మనం దాసోహం అనకతప్పదు.

స్వదేశీ అంటే అన్నింటినీ బహిష్కరించడం అని కాదు. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగాలి... కానీ అది మనకు అనుగుణంగా జరగాలి. అందుకోసం మనం స్వావలంబన సాధించాలి. స్వావలంబనతో ఉపాధి కల్పన సాధ్యమవుతుంది. ఒకవేళ మన ఉద్యోగాలు బయటికి వెళ్లిపోతే హింసకు దారిచ్చినట్టే. అందుకే స్వదేశీ అంటే స్వావలంబన... హింస కాదు" అని వివరణ ఇచ్చారు.


More Telugu News